రామ హనుమాన్


ఎమిరా! దొరా

ఎమిరా! దొరా
వరాల అంజనీ కుమార ఏమిరా దొరా
పుట్టగానే పిట్టవలె
నింగికెగిరినావట నింగికెగిరినావట
సూర్యున్ని పండువలె
మింగజూసినావటా మింగజూసినావటా
ఆకాశమార్గాన లంకజేరినావట
రాక్షసులు నీ తోక అంటిపెట్టినారట, మంటపెట్టినారట
తోకతోనే లంకనంత అంటిపెట్టినావట,
మంటపెట్టినావట

శ్రీరామ లక్ష్మణ జానకీ జై బోలో హనుమాన్‌ కి

రావణా లేవరా రవ్వధూళి కమ్ముకొచ్చె
రముడొచ్చె నీలంకతో రావణ

మూడుముళ్ళ తోకవాడు ముద్దు గుమ్మనివాడు
ముప్పు తెచ్చె నీలంకకు రావణ(రావణా లేవరా)
ఐదు ముళ్ళ తోకవాడు అంజజానీ తనయుడు
అంటిపెట్టి నీలంకను రావణ(రావణా లేవరా)
ఏడు ముళ్ళ తోకవాడు ఎత్తు ఎదిగినవాడు
ఎగిరివచ్చే నీలంకకు ఓ రావణ(రావణా లేవరా)

రామ జయ రామ రఘు సీతా రామ


రామ జయ రామ రఘు సీతా రామ
నీ నామము ఎంతో రుచి రా ఓ పావన నామ... (2)

స్వామి నీకు ఒక బంటు రామ దూత హనుమంతు.
ఎంగిలి పళ్లను ఇచ్చెను శబరి మాత తనవంతు.

నా వంతున ఏమి రాత రసితివో రామయ్య...... (2)
అనువుఅంత  కరుణ నాపై రవ్వంత
చూపవేమయ్యా... (రామ)

ఇసుకను రాల్చిన ఉడతను చేతితోన నిమిరావు...
గంగను దాటించి గుహుని గుండెలలో నిలిచావు...
నిండు భక్తితో నీ గుడి ముంగిటలో నీలి చావు..... (2)
నా అండ దండ నీవని కోదండ రామ కొలిచాను.... (రామ)

రాతిని నాతిగ చేసిన క్యాతి నీకు ఉందయ్య...
పాదుకలే గద్దెనెక్కి పాలన చేసేనయ్య...
బ్రమ్మ కడిగిన పాదం నెదే కద రామయ్య.....(2)
నా బ్రతుకు లోన వెలుగు రాత నేవే కదా రామయ్య... (రామ)

Comments