అమ్మవారి పాటలు


సాయంకాల సమయంలో


సాయంకాల సమయంలో
సంధ్య దీపారాధనలో
వచ్చును తల్లి మహాలక్ష్మి
ఇచ్చును వరములు ఎన్నెన్నో

పాలసముద్రుని పుత్రికగా
పరంధాముని ప్రాణసఖి
రావమ్మా ఇటు రావమ్మా
మము కరుణించగా రావమ్మా

మెడలో ఎన్నో హారాలు
సిగలో ఎన్నో పుష్పాలు
నవ్వుతూ వచ్చెను మాయమ్మ
మము కరుణించ గా రావమ్మా

ధనమును ఇచ్చే ధనలక్ష్మి
ధాన్యమును ఇచ్చే ధాన్యలక్ష్మి
వరమును ఇచ్చే వరలక్ష్మి
సంతానం ఇచ్చే సంతానలక్ష్మి

అందరూ చేరి రారండి
పండ్లు పూలు తేరండి
దేవి కి అర్చన చేద్దాము



దేవి స్వరూపమే చూద్దాము


అంబ అంబ పరమేశ్వరి


అంబ అంబ పరమేశ్వరి
అంబ పరమేశ్వరి అఖి లాండేశ్వరి
ఆది పరాశక్తి పాలయమాం..(అంబ)

శ్రీ భువనేశ్వరి రాజా రాజేశ్వరి,
ఆనంద రూపిణీ పాలయం. (అంబ)

వీణా పాణి విమలా స్వరుపీణి,
వేదాంత రుణిని పాలయమాం. (అంబ)

కమీతా దయాని కరుణ స్వరుపీణి,
కన్యాకుమరిణి పాలయమాం... (అంబ)

మంజుల భాషినీ మంగళ దాయిని
మధుర మీనాక్షి ని పాలయమాం... (అంబ)

రాజా స్వరూపీని రాజా రాజేశ్వరి
శ్రీ చక్ర వాసిని పాలయమాం... (అంబ)

అన్నపూర్ణేశ్వరి చాముండేశ్వరి
విశ్వ వినోదిని పాలయమాం... (అంబ)

అంబ జగదీశ్వరి కాషాయంబరి
కాళి పరాశక్తి పాలయమాం.... (అంబ)


జై భవాని జై జై భవాని


జై భవాని జై జై భవాని

నీలవేణి కరునించవేమి. (2)
అమ్మ రావే దుర్గ భవాని

తల్లి నీవే శాంకరీ... శ్రీవాణి. (2)

కృష్ణవేణీ తీరాన ఇంద్రకీల పర్వతాన. (2)
వెలిసినావే దుర్గమ్మ వ్యధలు తీర్చరావమ్మ. (2)

సురాసురుల కన్న తల్లి, సుందర రూపిని దేవి,
జగాలేలే మాయమ్మ, జగన్మాత నీవమ్మ..... (జై భవాని)

ఆది పరాశక్తి నేవే, అన్నపూర్ణ తల్లి నేవే (2)
అష్ట దశ పీఠాలను అధిష్టించు అమ్మ నేవే (2)

బొంబాయి అమ్మవు నీవు, కలకత్తా కాళి నీవు
మదురై మీనాక్షి నీవు - కంచి లో కామాక్షి వి నీవు. (జై భవాని)

మమ్ముల గన్న మాయమ్మ, మము బ్రోవ రావమ్మా. (2)
అంబ జగదాంబ మాత, అభయ నిలయ నీవమ్మా. (2)

అయిగిరి నందిని మాత, అష్టాదశల దుర్గ మాత



కరుణించే కాళీమాత - కనక దుర్గ నేవమ్మ. (జై భవాని)

Comments