అయ్యప్ప గీతాలు


స్వాగతం అయ్యప్పా...


స్వాగతం అయ్యప్పా... సుస్వాగతం అయ్యప్పా (2)
రతనాల పందిళ్ళలో ముత్యాల ముగ్గులు వేసి
నిను పూజించే వేళాయె రా స్వామి నీకు ఇదే మా ఆహ్వానము.(స్వాగతం)

పూలెన్నో తెచ్చాము నీ పూజకై
నాకెంతో మనసాయే ఈ వేళలో (2)
నీవున్నా ప్రతి ఇల్లు ఓ కోవెల (2)
పంపించు సిరులన్ని మా ఇంటికి..........(స్వాగతం)

నా పిలుపులే నీకు ఆహ్వానము
నా హృదయమే నీకు సింహాసనం (2)
నా కనులనే జ్యోతులుగా చేసి (2)
హారతులు ఇచేము ఈ వేళలో.......(స్వాగతం)

ఏనాడూ ఏ జన్మ ఏ పుణ్యమో
ఈనాడే నీ నోము నే నోచితి (2)
ఈ జగములో కలకాలము (2)
ఊటాము ఎప్పుడు నీ సేవలో(స్వాగతం)

లేవయ్య లేవయ్య లేచిరావయ్యా


లేవయ్య లేవయ్య లేచిరావయ్యా
వేచి ఉన్నా మయ్య లేచి చూడయ్యా

దేవతలు కోరగా మానవుడవై పుట్టి
మహిషిని వథియించి మాయమైన వంట

ధర్మాన్ని కాపాడు ఓ ధర్మశాస్త్ర
పులిపాలు తెచ్చావు ఓ పుణ్య మూర్తి

కొండ గుట్టలు దాటి మేము వచ్చాము
మా కోరికలు తీర్చ గా లేచి రా స్వామి

మానవ జన్మ ఎత్తి పాపాలు చే సేము
పుణ్యాన్ని కోరుతూ నీ కొండకు వచ్చేము

సన్నిధానం చేరి చాలాసేపు అయింది
లేచి కూర్చో స్వామి మేము చూస్తాము

ఆవు నెయ్యి తెచ్చాము అభిషేకమునకు
అటుకులు తెచ్చాము ఆరగించవ య్యా

మోగింది మోగింది గుడిలోని గంట
స్వామివారు నిద్రలేచి నారంట

అదిగదిగో చూడండి అయ్యప్పస్వామి
శబరి పీఠం మీద చిన్ముద్ర దారి

తెచ్చిన ముడుపులను స్వామికి ఇవ్వండి
మీ పాప భారాన్ని తగ్గించుకోండి

మా తల్లిదండ్రులను కాపాడు స్వామి
మా అన్నదమ్ములను ఆదరించ వయ్యా

మా ఆడపడుచులను కాపాడు దేవా
మా బంధుమిత్రులను కరుణించ వయ్యా

మా భార్య పిల్లలను కాపాడు స్వామి
మళ్లీ వచ్చే ఏడు నీ కొండకు వస్తాము

స్వామియే శరణం శరణం అయ్యప్ప
నీ నామమే మాకు శ్రీరామరక్ష


శివుడు విష్ణువు కాలవంగా


స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప (2)
ఆపద్బాంధవ అయ్యప్ప ఓ అనాధరక్షకా అయ్యప్ప (2)
హరి హర నందన అయ్యప్ప ఓ తారక ప్రభువా అయ్యప్ప (2)

స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప...

శివుడు విష్ణువు కలవంగా వెలసితివయ్యా ఓ దేవా (2)
మోహము ఎరుగని అయ్యప్ప నీవు కన్నెగ మిగిలావు అయ్యప్ప

స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప...

మదిలోన నిను తలచితిమి మనసారా నిను వేడితిమి
చల్లని చూపుల ఓ తండ్రి నీ మహిమలు చూపరా మా తండ్రి (2)




స్వామి శరణం అయ్యప్ప శరణం శరణం అయ్యప్ప...


రంగైన రతనాల


పల్లవి: రంగైనా రతనాల అందమైన శబరిమల
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
|రంగైనా!

నీవుండేది శబరిమలా! మేముండేది పాలమూరు
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
||రంగైనా॥

నీ తల్లీ మోహిని నీ తండ్రీ హరిహరుడు
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
రంగైనా॥

కార్తీక మాసాన మళాలే వేసితిమి
మండలాకాలంలో దీక్షాలే చేసితిమి
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా
||రంగైనా॥

ఇరుముడులూ కట్టుకోని నెత్తిమీద పెట్టుకోని
మేము గురుస్వామూల వెంబడీ వస్తున్నాము అయ్యప్పా
మము దయతో చూడగరావయ్యా శబరిగిరీ అయ్యప్పా



॥రంగైనా||

నీ మహిమే విన్నాము


పల్లవి: నీ మహిమే విన్నాము నిన్ను నమ్మి వచ్చాము
నీ రూపం చూశాము శరణమయ్యా
శరణం అయ్యప్పా స్వామి శరణం అయ్యప్పా

1. అందాల బాలుడా - ఆనంద రూపుడా
అందరిని కాపాడూ శరణం అయ్యా!
||శరణం అయ్యప్పా!!

2. మణికంఠ దేవుడా - మహాదేవ పుత్రుడా
మమ్మేలు కోవయ్యా శరణం అయ్యా!
||శరణం అయ్యప్పా

3. కరిమల వాసుడా కోమల రూపుడా
కాపాడ రావయ్య - శరణం అయ్యా!
శరణం అయ్యప్పా

4. పంపా నివాసుడా - పరబ్రహ్మ స్వరూపుడా
పందాల బాల నీకు శరణం అయ్యా!
||శరణం అయ్యప్పా!!

5. బంగారు బాటయ్య - కొండెక్కి రావయ్యా
శరణం అంటే చాలు సాగునయ్యా!



||శరణం అయ్యప్పా!!



స్వామి అయ్యప్ప


పల్లవి: స్వామి అయ్యప్పా స్వామీ అయ్యప్పా
నీవే గతిదేవా ననుబ్రోవగ ఇకరావా

అందకారమందే అలమటించి నేనూ
కన్నులుండి కూడా కాననైతి నిన్ను | ॥2॥
దేవ దేవ నాపై కరుణ కురియవేల |॥2||
వెలుగు వైపు నాకూ వేగమే చూపించుము తోవ
||'స్వామి అయ్యప్పా

సిరుల నెన్నడైనా అడుగుటెరుగనయ్యా
స్వర్గ సుఖముకోరీ వరము వేడనయ్యా ॥2॥
ముక్తి పొంద నెంచి చేయి చాచానయ్యా ॥2॥
శాంతి కోరి నిన్నే నేను పాడుచుందునయ్యా
||'స్వామి అయ్యప్పా

కనులలోను నీవే వెలుగు నింపుమయ్యా
మనసులోన నీవే కొలువు దీరవయ్యా
మధుర సుస్వరాల సుధలు కురుయుమయ్య
జీవులెల్ల నిన్ను కోరే శాంతి నొసగుమయ్య ||2॥
॥ స్వామి అయ్యప్పా!


Comments