కంఠం నల్లాన కన్నుగుడ్డు ఎర్రన
కంఠం నల్లాన కన్నుగుడ్డు ఎర్రన... (2)తల తల మెరుపుల శిరమున శివమణి. (2)
నాగన్నా...... నాగన్నా దిగు దిగు దిగరా నాగన్నా (2)
శ్రీ విష్ణువుకు నీవు శేష పాన్పు వైనావు... (2)
కాల కంటునికి నీవు కంట ఆహారమైనా వు (2)
నాగన్నా...... నాగన్నా నీకు వేయిపడగలు నాగన్న.
పని పాటలకు మేము రాతివేల పోతుంటే
కానరాని చీకట్లోమా కాలే తగిలినట్లయితే. (2)
నాగన్నా..... నాగన్నా మము కాటు వేయకురా నాగన్న
నాగుల పంచమి నాడు మహిళలంతా చేరేరు
పుట్ట ను పూజించేరు నీకు పాలు పోసి మొక్కేరు....
పుట్ట నిండ గోవు పాలు నీవు పొట్టనిండ తాగన్న...
నాగన్న మామ చల్లగా చూడు నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
ఇల్లల్లికి ముగ్గు పెట్టి నాగన్న
ఇంటా మల్లెలు జల్లి నాగన్న
మల్లెల వాసన తొ నాగన్న
కోలాట మాడి పోరా నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
భామా లంత చేరి నాగన్న
బావీ నీళ్ళ కెళితే నాగన్న
బావిలొ వున్నావ నాగన్న
బాలా నాగు వయ్యో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
పిల్లాలంత చేరి నాగన్న
పుల్లాలేర బోతె నాగన్న
గ్రల్లలొ వున్నావ నాగన్న
పిల్లా నాగు వయ్యో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
స్వామూలంత చేరి నాగన్న
రేవు నీళ్ళ కెళితే నాగన్న
రేవులొ వున్నావ నాగన్న
బాలా నాగు వయ్యో నాగన్న ||
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
అటు కొండ ఇటు కొండ నాగన్న
నడుమ నాగుల కొండ నాగన్న
కొండలో వున్నావ నాగన్న
కోడె నాగు వయ్యో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
దిగు దిగు దిగు నాగ నాగన్న
దివ్యా సుందర నాగో నాగన్న ॥
Comments
Post a Comment